భారతదేశం, జనవరి 24 -- అమెరికాను భయంకరమైన శీతాకాల తుపాను వణికిస్తోంది. సుమారు 150 మిలియన్ల మంది (15 కోట్ల మంది) అమెరికన్లు ప్రస్తుతం వాతావరణ అత్యవసర స్థితిని ఎదుర్కొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం నార్త్ వెస్ట్ టెక్సాస్, ఓక్లహోమా సిటీలలో భారీ హిమపాతంతో మొదలైన ఈ యూఎస్​ వింటర్​ స్నో స్టార్మ్​.. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. గడ్డకట్టే చలి, మంచు వర్షం, ఈదురుగాలుల తీవ్రత దృష్ట్యా ఇప్పటివరకు కనీసం 17 రాష్ట్రాలు 'స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ' ప్రకటించాయి.

ఓక్లహోమా నుంచి ఈశాన్య ప్రాంతం వరకు భారీగా మంచు కురుస్తుందని, కొన్ని చోట్ల అడుగు కంటే ఎక్కువ ఎత్తులో మంచు పేరుకుపోయే ప్రమాదం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్​డబ్ల్యూఎస్​) హెచ్చరించింది.

"దక్షిణ మైదానాలు, మిసిసిపి వ్యాలీ, ఆగ్నేయ ప్రాంతాల్లో మంచు వర్షం కురిసే అవకాశం ఉంది. దీనివల...