భారతదేశం, మార్చి 23 -- అమెరికా వర్జీనియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో ఓ కన్వీనియన్స్​ స్టోర్​లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి, అతని కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వర్జీనియాలోని భారతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టించింది. తమ భద్రతపై వారందరు ఆందోళన చెందుతున్నారు.

వర్జీనియా అకోమాక్ కౌంటీలోని లాంక్​ఫోర్డ్ హైవేపై ఉన్న బంధువుల దుకాణంలో ప్రదీప్ కుమార్ పటేల్ (56), ఆయన కుమార్తె పనిచేస్తున్నారు. కాగా మార్చ్​ 20న ఉదయం 5.30 గంటల తర్వాత కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి కాల్పుల గురించి ఒక ఫోన్ వచ్చింది. వారు వచ్చి చూసే సరికి పటేల్ తుపాకీ గాయాలతో కిందపడిపోయాడని, స్పందించడం లేదని తెలుసుకున్నారు.

పోలీసులు భవనం కోసం గాలిస్తుండగా కాల్పులకు గురైన మరో మహిళ కనిపించింది. ఆమె, పటేల్​ కూతురు అని తర్వాత తె...