భారతదేశం, ఫిబ్రవరి 1 -- అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంపో ఓ చిన్న విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లకే కుప్పకూలింది. దాని నుంచి మంటలు రావడం మొదలయ్యాయి. విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తుల ఆరుగురు అని ఎన్డీటీవీ పేర్కొంది. రాష్ట్ర గవర్నర్ జోష్ షాపిరో ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటన అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయానికి 4.8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కొన్ని ఇళ్లు కూడా అగ్నికి ఆహుతైనట్లు ప్రమాద స్థలంలోని చిత్రాల ద్వారా తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ ప్రయత్నాలు చేస్తున్నది.

స్ప్రింగ్‌ఫీల్డ్-బ్రాన్సన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే విమానం ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుండి బయలుదేరింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, లియర్‌జ...