భారతదేశం, జనవరి 27 -- US New Rules: అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలను అణిచి వేయడానికి కఠిన చర్యలకు ఉపక్రమించడం, అక్రమ వలసదారుల్ని స్వస్థలాలకు తిప్పి పంపుతుడంటంతో డిపోర్టేషన్ భయాల నడుమ, అదనపు ఆదాయం అవసరం ఉన్నా, USలో చదువుతున్న భారతీయులు తమ పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి.

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించే వారిలో చాలామందికి ఉద్యోగాలు అవసరమైనా తాజా ఆంక్షల కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో చదువులకు హాజరు కావడానికి తీసుకున్న రుణాల కారణంగా, విద్యార్థులు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలతో తమ చదువులు, భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తారని భయపడుతున్నారు.

డొనాల్డ్ ట్రంప్ రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, సరిహద్దు భద్రతను కఠినతరం చేయడం మరియు ...