భారతదేశం, ఏప్రిల్ 12 -- US new immigration rule: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. వివిధ కేటగిరీల వీసాలు, గ్రీన్ కార్డు కలిగి ఉన్న భారతీయులు సహా అమెరికాలోని విదేశీయులు ఇకపై తమ పత్రాలను ఎల్లవేళలా తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే, వారి పిల్లల వయస్సు 14 ఏళ్లు నిండిన వెంటనే వారి వేలిముద్రలు సమర్పించి, రీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

కొత్త నిబంధన ప్రకారం అమెరికాలో నివసిస్తున్న ఏ వలసదారు అయినా అడిగినప్పుడల్లా వారి చట్టపరమైన స్థితిని ధృవీకరించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రకటించింది. "18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికా పౌరులు కాని వారందరూ తమ చట్టపరమైన స్థితిని ధృవీకరించే డాక్యు...