భారతదేశం, మార్చి 25 -- టీసీఎస్​, ఇన్ఫోసిస్​, విప్రో.. ఇవి ఇండియాలో లీడింగ్​ టెక్​ కంపెనీలు. వీటిల్లో ఉద్యోగం చేయాలని ఐటీ ప్రొఫెషనల్స్​ కలలు కంటూ ఉంటారు. అయితే ప్రముఖ సామాజిక మాధ్యమం రెడ్డిట్​లో వైరల్​ అయిన పోస్ట్​.. దేశ ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి షాక్​కి గురిచేస్తోంది! ఇండియాలోని కొన్ని బడా ఐటీ కంపెనీల్లో నుంచి రిక్రూట్​మెంట్​ చేసుకోకూడదని.. అమెరికాకు చెందిన రిక్రూటర్​ 'గైడ్​లైన్స్'​లో ఉన్నట్టు ఓ వ్యక్తి రెడ్డిట్​లో పోస్ట్​ చేశాడు. అసలేం జరిగిందంటే..

ఓ రిక్రూటర్​ తనకు అనుకోకుండా 'సీక్రెట్​ ఇంటర్నల్​ సెలక్షన్​ గైడ్​లైన్స్​'ని షేర్​ చేసినట్టు రెడ్డిట్​ యూజర్​ చెప్పుకొచ్చాడు. ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేసే సమయంలో ఏ విషయాలను పరిశీలించాలి? అన్న వివరాలను అందులో ఉన్నాయని అతను వెల్లడించాడు.

గైడ్​లైన్స్​ ప్రకారం.. టాప్​ యూనివర్స...