భారతదేశం, ఫిబ్రవరి 17 -- నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రంలో ఊర్వశి రౌతేలా ఓ కీలకపాత్ర చేశారు. ఓ పాటలోనూ జోష్‍గా చిందేశారు. ఈ మూవీ ప్రమోషన్లలోనూ జోరుగా పాల్గొన్నారు ఊర్వశి. ఈ మూవీ సక్సెస్ పార్టీల్లోనూ సందడి చేశారు. డాకు మహరాజ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇటీవల వెల్లడి కాగా.. పోస్టర్లో ఊర్వశి మిస్ అయ్యారు. దీనిపైనే నెటిజన్లు నుంచి ఫన్నీ రియాక్షన్లు వస్తున్నాయి.

డాకు మహరాజ్ చిత్రం స్ట్రీమింగ్ డేట్‍ను నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు పోస్టర్ తీసుకొచ్చింది. ఈ పోస్టర్లో హిరో నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నారు. అయితే, కీలక పాత్ర చేసిన ఊర్వశి మాత్రం ఇందులో లేరు. దీంతో ఊర్వశి ఎక్కడ అంటూ కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

డాకు మహరాజ...