భారతదేశం, ఏప్రిల్ 15 -- బాలీవుడ్ గ్లామర్ డాల్ ఊర్వశి రౌటేలా మరో బాంబ్ పేల్చింది. కాంట్రవర్సీకి కారణమైన ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేసి, వెంటనే డిలీట్ చేసింది. కానీ అది నెటిజన్ల చేతికి ముందే చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఊర్వశి చేసిన పనికి ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. 'నీ పని నువ్వు చేసుకోకుండా పక్కనవాళ్లపై పడి ఎందుకు ఏడుస్తావంటూ' ఫ్యాన్స్ విపరీతంగా ఫైర్ అవతున్నారు. అసలేం జరిగిందో ఇక్కడ చూసేయండి.

ఇటీవల రిలీజైన బాలీవుడ్ మూవీ 'జాట్'లో ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవల తెలుగు, హిందీలో వరుసగా స్పెషల్ సాంగ్స్ తో జోరుమీదున్న ఈ హాట్ బ్యూటీ.. 'జాట్'లోనూ ఆడిపాడింది. 'సారీ బోల్' అనే సాంగ్ లో అందచందాలతో కనువిందు చేసింది. మరోవైపు స్పెషల్ సాంగ్స్ లో బోల్డ్ మూవ్స్ తో కుర్రాళ్ల ను పిచ్చెక్కిస్తున్న తమన్నా భాటియా కూడా తాజాగా 'రైడ్...