Hyderabad, ఫిబ్రవరి 24 -- యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోనే ఉండే ఒక వ్యర్థ పదార్థం. ఇది అధిక మొత్తంలో శరీరంలో పేరుకు పోతే ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్లే శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోతుంది.

మూత్రపిండాలు ఈ యూరిక్ యాసిడ్ ను ఫిల్టర్ చేస్తాయి. కానీ అధిక మొత్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతే కిడ్నీలు ఫిల్టర్ చేయలేక అలసిపోతాయి. అప్పుడు యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపంలో శరీరంమంతటా వ్యాపించి పేరుకుపోవడం మొదలుపడుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పిగా అనిపిస్తే అక్కడ యూరిక్ యాసిడ్ పేరుకుపోయిందేమోనని అనుమానించాల్సిందే. ఈ అధిక యూరిక్ యాసిడ్‌ని ఎలా వదిలించుకోవాలో తెలుసుకోండి.

అధిక యూరిక్ యాసిడ్ వల్ల శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పి అధికం అయిపోతుంది. కీళ్ళల్లో నొప్పుల...