Hyderabad, మార్చి 17 -- వెలగపండు అంటే ఇప్పటి పిల్లలకు, యువతకు తెలియకపోవచ్చు. దీన్నే ఆంగ్లంలో వుడ్ యాపిల్ అని పిలుస్తారు. అలాగే బేల్ అని కూడా అంటారు. దీనిలో ఉండే ఆరోగ్య పోషకాలు ఎక్కువ. దీన్ని జ్యూసుగా తాగితే శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ చాలావరకు తగ్గిపోతుంది.

వాతావరణం మారిన వెంటనే, ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో కొన్ని అవసరమైన మార్పులు చేయడం ప్రారంభిస్తారు. హోలీతో వేసవి సీజన్ కూడా మొదలైంది. ఈ సీజన్లో ప్రజలు ఆకలి కంటే దాహం ఎక్కువగా ఫీలవుతారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, శరీరం నుండి చెమట బయటకు వస్తుంది. ఎంతో మంది డీహైడ్రేషన్ కు గురవుతారు. అటువంటి పరిస్థితిలో, తమను తాము ఆరోగ్యంగా ఉంచడానికి మరియు శరీరంలో నీటి కొరతను తీర్చడానికి, ప్రజలు నిమ్మరసం, కొబ్బరి నీరు, లస్సీ వంటి వాటిని ఆహారంలో చేర్చుకుంటారు.

అయితే ఈ సీజన్ లో వెలగ పండు క...