Hyderabad, మార్చి 6 -- యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగడం అనేది తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది. దీన్ని ఎక్కువ కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే ఎముకలు, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ చెబుతున్న ప్రకారం మహిళల్లో యూరిక్ యాసిడ్ 6 mg కన్నా ఎక్కువగా ఉండకూడదు. అదే పురుషుల్లో అయితే 7 mg కంటే ఎక్కువగా ఉండకూడదు. అంతకన్నా ఎక్కువగా అంటే అది ప్రమాదకరమనే చెప్పుకోవాలి.

శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తాయి. నడవడంలో కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, కీళ్ళల్లో వాపు, కీళ్ళు దృఢంగా మారి ఇబ్బంది పెట్టడం, జ్వరం రావడం, కండరాల నొప్పులు, విపరీతమైన నీరసం వంటివి కనిపిస్తాయి. ఈ సమస్య రోజురోజుకీ తీవ్రంగా మ...