New Delhi, మే 9 -- UPSC NDA NA results 2024: యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ 2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తన అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.

115వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు (INAC) జనవరి 2 నుంచి ప్రారంభం అవుతోంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ప్రవేశం కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (SSB) నిర్వహించే ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లను యూపీఎస్సీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. రాత పరీక్ష ఫలితాలు వెలువడిన రెండు వారాల్లోగా అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ వెబ్సైట్ joinindianarmy.nic.in లో ఆన్లైన్...