భారతదేశం, ఏప్రిల్ 16 -- UPSC Civils results: యూపీఎస్సీ సివిల్స్, 2023 (UPSC CSE final results) తుది ఫలితాలు విడుదల అయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ, గ్రూప్ బి ఉద్యోగాలను ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా యూపీఎస్సీ భర్తీ చేస్తుంది.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 (UPSC CSE final results) లో మొత్తం 1016 మంది ఉత్తీర్ణులయ్యారని యూపీఎస్సీ వెల్లడించింది. 2022-23 యూపీఎస్సీ సీఎస్ఈ ఫైనల్ పరీక్షల్లో ఆదిత్య శ్రీవాస్తవ ఆలిండియా ర్యాంక్ 1 సాధించారు. రెండో ర్యాంకు సాధించిన అనిమేష్ ప్రధాన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ తుది ఫలితాల్లో దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించా...