భారతదేశం, మార్చి 12 -- యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం లావాదేవీలు ఉచితమే అయినా పెద్ద వ్యాపారాలకు ఛార్జీలు వసూలు చేయాలని బ్యాంకులు కోరుతున్నాయి. దాని ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. అయితే యూపీఐ మునుపటి మాదిరిగానే చిన్న వ్యాపారులకు ఉచితం. దీని వల్ల సామాన్యులు కూడా ఇబ్బంది పడరు.

ఏటా రూ.40 లక్షలకు మించి విక్రయించే వ్యాపారుల నుంచి మర్చంట్ ఫీజు వసూలు చేయాలని బ్యాంకింగ్ పరిశ్రమ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో కోరినట్లు తెలిసింది. పెద్ద వ్యాపారులు ఇప్పటికే వీసా, మాస్టర్ కార్డ్, క్రెడిట్ కార్డులపై మర్చంట్ ఫీజు చెల్లిస్తున్నప్పుడు యూపీఐ, రూపే కార్డులపై కూడా ఛార్జీలు వసూలు చేయాలని బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు వాదిస్తున్నాయి.

2022 బడ్జెట్లో ప్...