భారతదేశం, మార్చి 10 -- టాటా మోటార్స్ ఈ సంవత్సరం భారత మార్కెట్లో అనేక కొత్త కార్లు, ఎస్‌యూవీలను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో కంపెనీ ప్రొడక్షన్-స్పెక్ హారియర్ ఈవీని ఆవిష్కరించింది. ఇది కాకుండా పెట్రోల్‌తో నడిచే సియెర్రా ఎస్‌యూవీ ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్‌ను కూడా ఇదే ఈవెంట్‌లో ప్రదర్శించారు. ఈ కార్లు ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించాయి. టాటా నుంచి రాబోయే ఈ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

టాటా పాపులర్ ఎస్‌యూవీ హారియర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టెస్టింగ్ సమయంలో హారియర్ ఈవీ కనిపించింది. ఈ ఈవీ ఫుల్ ఛార్జ్ చేస్తే 550 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. హారియర్ ఈవీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతి సుజుకి ఇ-విటార...