భారతదేశం, మార్చి 31 -- మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తుంటే.. మీకు గుడ్ న్యూస్. ఏప్రిల్ నెలలో పలు కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. 7300 ఎంఏహెచ్ బ్యాటరీతోనూ స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ఏప్రిల్లో శాంసంగ్, మోటరోలా, ఐక్యూతోపాటుగా ఇతర బ్రాండ్లకు చెందిన పలు ఫీచర్ ప్యాక్డ్ ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నాయి. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే కచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోండి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది గొప్ప పనితీరును అందిస్తుంది. ఇది స్లిమ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి.. ఇందులో టెలిఫోటో లెన్స్ లేదా పెద్ద బ్యాటరీని పొందలేరు. గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా తరహాలో 2కే డిస్ ప్లే, 200 ఎంపీ మెయిన్ కెమెరా, టైటానియం ఫ్రేమ్ తదితర ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

ఇది మిడ్ రేంజ్ స్మార్ట్ ఫో...