భారతదేశం, ఫిబ్రవరి 24 -- శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టిప్‌స్టర్ లీక్స్ ప్రకారం, శాంసంగ్ తన గెలాక్సీ ఏ-సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఇందులో గెలాక్సీ ఏ 56, ఏ 36, ఏ 26 ఉన్నాయి. మార్చిలో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ మూడు మోడళ్లలో ఒక సాధారణ లక్షణం వాటి కెమెరా డిజైన్. ఈ కెమెరా అద్భుతంగా కనిపిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ56, ఏ36 మోడళ్లు ఐపీ67 రేటింగ్‌తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌గా ఉంటాయి.

ఇటీవల గెలాక్సీ ఏ56 కలర్ వేరియంట్‌ను చూపించే జిఫ్‌ కనిపించింది. ఇందులో అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు బ్రష్ ఫినిష్, కెమెరా బంప్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్ ఫ్రం...