భారతదేశం, ఫిబ్రవరి 7 -- Upasana on Ram Charan and Klin Kara: హీరో రామ్ చరణ్ సతీమణి, పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల తమ కుమార్తె క్లిన్ కారా గురించి మాట్లాడారు. ఇటీవల గలాటా రిట్జ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తామిద్దరం పేరెంటింగ్ డ్యూటీలను ఎలా పంచుకుంటామో చెప్పడంతోపాటు క్లిన్ కారా టోటల్ 'డాడీస్ గర్ల్' అని తెలిపింది. అంతేకాదు వాళ్లిద్దరినీ చూస్తే తనకు అసూయ కలుగుతుందని కూడా చెెప్పడం విశేషం.

ఈ ఇంటర్వ్యూలో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రామ్ చరణ్ ను చూడగానే తమ కూతురు క్లిన్ కారా ముఖం వెలిగిపోతుందని ఆమె చెప్పింది. క్లిన్ కారాది తన తండ్రి పోలికా అని ప్రశ్నించినప్పుడు ఉపాసన ఇలా స్పందించింది.

"శక్తి హృదయం నుంచి వస్తుంది. క్లిన్ కారా పెంపకంలో మేమిద్దరం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నామని నేను అనుకుంటున్నాను. అమ్మ ఏం చేయాలని అనుకుంటామో,...