Hyderabad, ఏప్రిల్ 9 -- Upasana Egg Freezing: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఉపాసన కొణిదెల తన అండాలను ఫ్రీజ్ చేయించడంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. పెళ్లి, అమ్మతనం, ఇతర అంశాలపైనా ఆమె స్పందించింది. మసూమ్ మీనావాలాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది.

కెరీర్లో బిజీగా ఉండే చాలా మంది మహిళల ఈ మధ్యకాలంలో తమ అండాలను ఫ్రీజ్ చేసి పెడుతున్నారు. అమ్మ కావాలనుకున్న సమయంలో వాటిని తిరిగి ఉపయోగించుకుంటున్నారు. ఉపాసన కూడా అదే పని చేసింది. ఆమె అభిప్రాయం మేరకు అండం ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం అంటే మహిళలకు ఓ ఇన్సూరెన్స్ పాలసీలాంటిదేనట. అండం ఫ్రీజ్ చేయడంపై అడిగినప్పుడు ఆమె ఇలా స్పందించింది.

"ఆ నిర్ణయం కఠినమైనదేమీ కాదు. అండాన్ని ఫ్రీజ్ చేసే ప్రక్రియ కష్టం కాదు. ఇది కేవలం సంతానం కోసమే అతని భావిస్తుంటారు. కానీ...