భారతదేశం, ఫిబ్రవరి 1 -- గత 75 ఏళ్లలో మునుపెన్నడూ లేని విధంగా మధ్య తరగతికి అనుకూలమైన బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని.. బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పత్తి, పప్పు దినుసులు పండించే రైతులకు లాభదాయకమైన బడ్జెట్ అని వివరించారు. ఇది సంక్షేమ బడ్జెట్, పేదల పెన్నిధి నరేంద్ర మోదీ అని కొనియాడారు. ప్రధాని మోదీ, ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు చెప్పారు. బడ్జెట్‌పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.

'కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉంది. పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ ఇది. మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరం. ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర్య. గత 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్ ఎన్నడూ రాలేదు' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

'ఇద...