భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చెయ్యే చూపారని.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిహార్ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే.. ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు కేటాయించలేదని వ్యాఖ్యానించారు. పథకాలకు కూడా పెద్దగా నిధులు కేటాయించలేదని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకంగా ఉన్నారన్న మిథున్.. ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులను రాబట్టుకోవడంలో బీహ‌ర్ సీఎం నితీష్ స‌క్సెస్ అయ్యారని వ్యాఖ్యానించారు.

'రాష్ట్రానికి నిధులు రాబట్టే విషయంలో ఏపీ ముఖ్యమంత్ర చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. బడ్జెట్‌లో బీహార్‌కు బొనాంజాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచెయ్యి చూపించింది. ఇచ్చింది గుండుసున్నానే. దీనిపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంతర్మథనం చే...