తెలంగాణ, ఫిబ్రవరి 2 -- కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలోనే.. హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో ఆర్థిక మంత్రి భట్టితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలోని చేపట్టిన కీలక ప్రాజెక్టుల విషయాలను పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని. కానీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడమేంటని ప్రస్తావించ...