భారతదేశం, ఫిబ్రవరి 1 -- 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‍ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. నేడు (ఫిబ్రవరి 1) లోక్‍సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి యువజన, క్రీడల శాఖకు రూ.3,794.30 కోట్లను బడ్జెట్‍లో కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. గతేడాది కంటే ఇది ఎక్కువ. క్షేత్రస్థాయిలో క్రీడాకారులను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చేందుకు తలపెట్టిన ఖేలో ఇండియాకు పెద్దపీట వేసింది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను గతేడాది బడ్జెట్‍లో యువజన, క్రీడాశాఖకు కేంద్ర ఆర్థిక శాఖ రూ.3,442.32 కోట్ల కేటాయించింది. అయితే, ఈసారి 2025-26లో రూ.3,794.30 కోట్లను కేంద్రం ఆ శాఖకు కేటాయింపులు చేసింది. అంటే సుమారు రూ.351.98 కోట్ల భారీ మొత్తాన్ని ఆ శాఖకు కేంద్ర పెంచింది.

యువజన, క్రీడల శాఖకు కేటాయించిన మొత్తంలో ఖేలో ఇండియాకు పె...