Hyderabad, మార్చి 15 -- కాలంతో పాటు వేసుకునే దుస్తుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్యాషనబుల్‌గా అనిపించినవి ఇప్పుడు పూర్తిగా ఔట్‌డేటెడ్ అయిపోయాయి. అలాగే అప్పట్లో వేసుకున్న డిజైన్లు కొన్ని ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఏదేమైనా.. మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా, అందంగా మార్చడంలో మీరు వేసుకునే దుస్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందరితో పాటు అప్ డేటెడ్‌గా కనిపించడం మీ హుందాతనానికి అవసరం కూడా. అందుకనే ప్రస్తుత ఫ్యాషన్ సెన్స్, గ్రూమింగ్ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

అలాగని ట్రెండ్ ని గుడ్డిగా ఫాలో అయిపోవడం కూడా చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఏ ఫ్యాషన్ ట్రెండ్‌ని అయినా సరే ఎవరో వేసుకున్నరనీ, మీకు నచ్చిందనీ ఎక్కువగా వేసుకోవడం వల్ల మీరు ప్రమాదాలను కొనితెచ్చుకున్న వారవుతారు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని దుస్త...