Hyderabad, జనవరి 30 -- అల్సర్ పొట్టను ఇబ్బంది పెట్టే సమస్య. వినడానికి చిన్నదే అయినా ఎంతో చికాకును కలిగిస్తుంది. పొట్ట, పేగుల ఉపరితలంపై ఉన్న పొరలు ఆమ్లాలల వ్లల మంటకు గురవుతాయి. అక్కడ చిన్న గాయాలు, పుండ్లు వంటివి పడతాయి. అదే అల్సర్లు. అలాగే హెలికోబాక్టర్ పైలోరీ అంటే బ్యాక్టిరియా వల్ల ఇన్షెక్షన్ వచ్చి అల్సర్ కు కారణం అవుతుంది.

అల్సర్లు తీవ్రంగా మారితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రాణాంతకంగా మారిపోయే అవకాశం ఉంది. అల్సర్ల వల్ల అంతర్గత రక్తస్రావం అవుతున్నా, వాంతుల్లో రక్త కనిపిస్తున్నా, మలంలో రక్తం పడినా, పొట్టకు లేదా పేగులకు రంధ్రాలు పడినా ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అల్సర్లు అలాగే తీవ్రమైన పుండ్లుగా మారి క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్సర్లను తక్కువ అంచనా వేయకూడదు.

అల్సర్ వల్ల పొట్ట తీవ్రంగా ఇబ్బంది కనిపిస్తుంటే అలసత...