భారతదేశం, ఫిబ్రవరి 18 -- సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌కు సంబంధించి రష్యా, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో రష్యా 176 డ్రోన్లతో దాడి చేసిందని ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. ఈ దాడి తర్వాత 38 అపార్ట్ మెంట్లను ఖాళీ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అదే సమయంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరింది. కనీసం 103 డ్రోన్లను కూల్చివేసిట్టుగా సైన్యం వెల్లడించింది. అదే సమయంలో 67 డ్రోన్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని పేర్కొంది. కొన్ని చోట్ల డ్రోన్ పడిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ దాడికి సంబంధించి రష్యా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

మధ్య ఉక్రెయిన్‌లోని డోలిన్స్కా నగరంలోని ఒక నివాస భవనంపై రాత్రిపూట పెద్ద ఎత్తున జరిగిన రష్యన్ డ్రోన్ దాడిలో ఒక తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు గాయపడ్డారని రాయిటర్స్ వార్త ప్రచురించింది. 38 అపార్ట్‌మెంట్‌ల నుండి ...