Hyderabad, జనవరి 29 -- UI OTT Release Date: ఉపేంద్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ యూఐ. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరో షాక్ తగిలింది. ఈ మూవీ ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉపేంద్ర నటించిన యూఐ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులు రెండూ సన్ నెట్‌వర్క్ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ తర్వాత మూవీ టీమ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. యూఐ ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ఇచ్చే అప్డేట్సే ఫాలో కావాలని స్పష్టం చేసింది.

అయితే మూవీ శాటిలైట్ హక్కులు మాత్రం జీ నెట్‌వర్క్ కే దక్కాయని అప్పుడే తేలిపోయింది. తాజాగా జీ కన్నడ ఛానెల్ ఈ మూవీ ప్రోమో కూడా రిలీజ...