భారతదేశం, జూలై 14 -- యూజీసీ నెట్ జూన్ 2025 ఫలితాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in లో విడుదల చేయనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). ఫలితాలతో పాటు ఫైనల్​ ఆన్సర్ కీని కూడా విడుదల చేయనుంది. లింక్ యాక్టివేట్ అయిన తర్వాత, అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో లాగిన్ అయి ఫలితాలను చూసుకోవచ్చు.

అభ్యర్థులు తమ యూజీసీ నెట్ జూన్ 2025 ఫలితాలను ఎన్టీఏ యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలో చెక్​ చేసుకోవచ్చు.

గత సంవత్సరాల ట్రెండ్‌లను బట్టి చూస్తే, యూజీసీ నెట్ ఫలితాలు, తుది ఆన్సర్ కీ సాధారణంగా.. తాత్కాలిక ఆన్సర్ కీ విడుదలైన 2-4 వారాల్లోపు విడుదలవుతాయి. అయితే, తాత్కాలిక కీ జులై 5న విడుదలైంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణ జులై 8న ముగిసింది.

మీ యూజీసీ నెట్ ఫలితాలను చెక్​, స్కోర్​కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది దశలను అనుసరించండి...