భారతదేశం, ఏప్రిల్ 20 -- యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్ కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభమ య్యాయి. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు యూజీసీ నెట్ 2024 (UGC NET June 2024) జూన్ సెషన్ కోసం ఏప్రిల్ 20 వ తేదీ నుంచి ugcnet.nta.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నాలుగు సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ లేదా 8 సెమిస్టర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న వారి తో పాటు, చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ లో ఉన్న విద్యార్థులు కూడా ఈ యూజీసీ నెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన విద్యార్థులు.. డిగ్రీలో వారు చదివిన ఏ సబ్జెక్ట్ లో అయినా పీహెచ్ డీ చేసేందుకు ఈ యూజీసీ నెట్ పరీక్ష రాయవచ్చు.

యూజీసీ నెట్ జూన్ 2024 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్ లో మాత్రమే నిర్వహిస్తారు. ఈ యూజీసీ ...