Hyderabad, మార్చి 30 -- Ugadi Wishes 2025 From SRH Nithin Sreeleela David Warner: ఇవాళ ఉగాది. ఈ పర్వదినాన అందరూ ఉగాది సంబురాలు చేసుకుంటారు. అలాగే, బంధుమిత్రులు అందరికి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను పలు విధాలుగా తెలియజేస్తుంటారు.

ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది. ఇవాళ (మార్చి 30) విశాఖపట్నం వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు తలపడనుంది. మధ్యాహ్నాం మూడున్నర గంటలకు డీసీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ 2025 మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ క్రమంలో గ్రౌండ్‌లో నుంచి సన్ రైజర్స్ హైదరబాద్ టీమ్ అంతా తెలుగు ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ముందుగా నితీష్ కుమార్ రెడ్డి "తెలుగు ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు" అని తెలుగు...