Hyderabad, మార్చి 30 -- ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. వేరు వేరు రకాల రుచులు కలిగిన ఆరు రకాల పదార్థాలతో తయారు చేసి ఈ పచ్చడిలేనిదే ఉగాది అసంపూర్ణంగా ఉంటుందని అంతా నమ్ముతారు. అసలు ఉగాది పండుగ ప్రత్యేకత ఏంటి? ఈ రోజున పచ్చడి ఎందుకు చేస్తారు వంటి విషయాలను తెలుసుకుందాం రండి.

హిందూ పురాణాల ప్రకారం, అతి ప్రాచీనమైన పండుగలలో ఉగాది ఒకటి. ఉగాది అనేది పచ్చి పంచాంగం (నూతన పంచాంగం) ప్రకారం కొత్త సంవత్సరానికి మొదటి రోజుగా పరిగణించబడుతుంది. ఇది కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త అవకాశాలు కోసం సమయం. జీవితాన్ని సానుకూలంగా స్వీకరించేందుకు, కొత్త లక్ష్యాలు నిర్ణయించడానికి, ఆధ్యాత్మిక, మానసిక అభివృద్ధికి దీన్ని ఆరంభంగా భావిస్తారు. ఇది "కొత్త దారులను చూపించే వెలుగు" లాంటిదని నమ్ముతారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, దక్...