భారతదేశం, మార్చి 19 -- Ugadi Awards : విశ్వసునామ ఉగాది వేడుక‌లు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 30 రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుక‌లు నిర్వహించ‌నుంది. ఈ వేడుక‌ల్లో 14 రంగాల్లో సేవ‌లందించిన ప్రముఖుల‌కు క‌ళార‌త్న అవార్డులు, ఉగాది పుర‌స్కారాలు ప్రదానం చేస్తారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోఈ ఉగాది వేడుకలకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత జ‌రిగే మొద‌టి ఉగాది పండ‌గ కావ‌డంతో చాలా ఘ‌నంగా నిర్వహించాల‌ని ప్రభుత్వం యోచిస్తుంది.

ఉగాది ఉత్సవాల‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెంబ‌ర్ 56ను విడుద‌ల చేశారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగను రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటున్నామ‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు....