Hyderabad, మార్చి 20 -- ఉగాది మన తొలి తెలుగు పండుగ. తెలుగు కొత్త సంవత్సరం ఆరంభమయ్యే రోజు హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో మొదటి రోజు ఉగాదిని నిర్వహించుకుంటాం. ఈసారి మార్చి 30న ఉగాది వచ్చింది. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలోనే ఉగాది ఏర్పడుతుంది. 2025లో మార్చి 30న మనం ఉగాది పండుగ రోజు నిర్వహించుకోబోతున్నాము.

యుగాది అనే పదం నుంచి ఉగాది పుట్టిందని చెప్పుకుంటారు. యుగానికి ఆది అంటే ఏడాది ప్రారంభాన్ని ఈ పదం సూచిస్తుంది. మన పంచాంగం ప్రకారం ఒక్కో తెలుగు సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. గత ఏడాది ఉగాదిని క్రోధినామ సంవత్సరంతో నిర్వహించుకున్నాం. ఈసారి విశ్వావసు నామ సంవత్సరంగా ఉగాది పండుగను నిర్వహించుకుంటాం. కేవలం తెలుగు వారికే కాదు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల వారికి ఉగాది ప్రత్యేకమైన పండుగ.

మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వా బాగా నిర్వహించుకుంటార...