భారతదేశం, డిసెంబర్ 10 -- Ugadi 2026: తెలుగు మాసాల ప్రకారం జరుపుకునే మొట్టమొదటి పండుగ ఉగాది పండుగ. పురాణాల ప్రకారం మనకు మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. అలాగే 12 తెలుగు మాసాలు ఉంటాయి. తెలుగు నెలల్లో మొట్టమొదటిది చైత్రమాసం. చైత్రమాసంలో వచ్చే పాడ్యమి నాడు అంటే మొదటి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము.

బ్రహ్మ చైత్ర శుక్ల పాడ్యమి నాడు సృష్టిని ప్రారంభించాడని అంటారు. ఆ తిధినే కృతయుగం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. ఇక 2026లో ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది? ఉగాది పండుగ తేదీ, సమయంతో పాటుగా మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఉగాది పండుగను ప్రతి ఏడాది చైత్ర మాసంలో వచ్చే శుక్లపక్ష పాడ్యమినాడు జరుపుకుంటాము. ఉగాది అంటే యుగానికి ప్రారంభం అని అర్థం. 'యుగాది' అనే పదం 'ఉగాది'గా మారింది. విశ్వావసు నామ సంవత్సరం పూర్తవుతోంది. ఇక కొత్త తెలుగు సంవత్సరం రాబోతోంది....