Hyderabad, ఏప్రిల్ 18 -- New Hero Uday Raj About His Diet And Chiranjeevi: ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి పలు క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి 'మధురం' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు ఉదయ్ రాజ్. రాజేష్ చికిలే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొత్త హీరో ఉదయ్ రాజ్‌కు వైష్ణవి సింగ్ హీరోయిన్‌గా నటించింది.

శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై యం. బంగార్రాజు నిర్మించారు. 'ఎ మెమొరబుల్ లవ్' ట్యాగ్ లైన్‌తో టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన మధురం ఇవాళ శుక్రవారం (ఏప్రిల్ 18) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న మధురం సినిమా విశేషాలను న్యూ హీరో ఉదయ్ రాజ్ ఇలా ముచ్చటించారు.

"చిన్నప్పట్నుంచీ చిరంజీవి గారిపై ఇష్టం ఉండేది. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. తర్వాత 'ఆచార్య' షూటింగ్ టైమ్‌లో ఆయన (చిరంజీవి) మాట్లాడటం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. 12 ఏళ్...