Hyderabad, ఏప్రిల్ 10 -- డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పడం కష్టం. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా ఇది వచ్చే అవకాశం ఉంది. కానీ చాలామందికి డయాబెటిస్ పై ఇంకా అవగాహన లేదు. టైప్1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, జెస్టెషనల్ డయాబెటిస్.. ఇలా మూడు రకాల డయాబెటిస్ లు ఉన్నాయి. ఇవి ఎవరికి వస్తాయి? ఎందుకు వస్తాయి? అనే విషయాలను తెలుసుకుందాం. అలాగే వీటి మధ్య తేడా ఏంటో అవగాహన చేసుకుందాం.

ఇది పిల్లలకు వచ్చే వ్యాధి. కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది. పిల్లలకు రెండేళ్లు లేదా మూడేళ్ల వయసులో బయటపడుతుంది. కొంతమందికి టీనేజీ వయసులో కూడా బయటపడుతుంది. క్లోమంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం అయిపోవడం వల్ల ఈ టైప్1 డయాబెటిస్ వస్తుంది. దీనికి నివారణ లేదు. స్థిరంగా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాల్సి వస్తుంది. అప్పుడే ఆ వ్యక్...