భారతదేశం, ఏప్రిల్ 11 -- తెలుగు యాంక‌ర్లు ప్ర‌దీప్ మాచిరాజు, దీపిక పిల్లి హీరోహీరోయిన్లుగా న‌టించిన అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌న్ ల‌వ్‌డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీకి జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షో క్రియేట‌ర్స్ నితిన్‌, భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే.

అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఆద్యంతం టైమ్‌పాస్ చేసే మంచి ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇద‌ని ఆడియెన్స్ ట్వీట్స్ చేస్తోన్నారు. ప్ర‌దీప్‌, దీపికా త‌మ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకున్నార‌ని చెబుతున్నారు.

గెట‌ప్ శ్రీను, స‌త్య కామెడీ అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింద‌ని అంటున్నారు. వారు స్క్రీన్‌పై క‌నిపించే ప్ర‌తిసీన్ క...