Hyderabad, మార్చి 7 -- TV Show Time Change: తెలుగు టీవీ షోలలో ఈటీవీలో వచ్చే వాటికి టాప్ టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతూ ఉంటాయి. అందులోనూ సుమా యాంకర్ గా చేసే సుమ అడ్డాకు ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఈ షో టైమ్ ఇప్పుడు మూడోసారి మారబోతోంది. మారిన టైమ్ మార్చి 16 నుంచి అమల్లోకి రాబోతోంది.

ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ చేసే సెలబ్రిటీ గేమ్ షో సుమ అడ్డా. చాలా రోజులుగా ఈటీవీలో టెలికాస్ట్ అవుతోంది. మొదట ఈ షో క్యాష్ 2.0 స్థానంలో ప్రతి శనివారం రాత్రి 9.30 గంటలకు వచ్చేది. 74 ఎపిసోడ్ల తర్వాత ఈ షో టైమ్ ను మంగళవారం రాత్రి 9.30 గంటలకు మార్చేశారు.

ఇప్పుడు మరోసారి సుమ అడ్డా షో సమయాన్ని మార్చినట్లు ఈటీవీ వెల్లడించింది. మార్చి 16 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు సుమ అడ్డా షో టెలికాస్ట్ కానుంది.

సుమ అడ్డా షో టైమ్ మారినట్లుగా చెప్పడానికి ఈటీవీ ఓ వీడియోను రిలీజ్ చేస...