భారతదేశం, ఫిబ్రవరి 24 -- తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి జ్యోతి పూర్వజ్. స్టార్ మాలోని గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా, హీరోకు తల్లిగా అలరించిన జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా మారి వెండితెరపై గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తోంది. జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్ ఫీమేల్ లీడ్ పాత్రలో చేసిన లేటెస్ట్ మూవీ కిల్లర్.

తెలుగులో సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిల్లర్ మూవీకి జ్యోతి రాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా కిల్లర్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన కిల్లర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో జ్యోతి పూర్వజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు జ్యోతి పూర్వజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. "నేను సీరియల్స్‌లో రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ విసి...