భారతదేశం, మార్చి 12 -- స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న చిన్ని సీరియ‌ల్‌లోకి బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మంగ‌ళ‌వారం నాటి ఎపిసోడ్‌లో నిఖిల్ క్యారెక్ట‌ర్‌ను రివీల్ చేసి ఆడియెన్స్‌ను మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ చేశాడు. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఏసీపీ విజ‌య్ అనే పాత్ర‌లో నిఖిల్ క‌నిపించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

సినిమాల్లో మాదిరిగా యాక్ష‌న్ సీక్వెన్స్‌తో స్టైలిస్‌గా సీరియ‌ల్‌లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. జిమ్‌లో ఓ అమ్మాయిపై కొంద‌రు అఘాయిత్యానికి పాల్ప‌డ‌బోతుంటారు.వృద్ధుడి గెట‌ప్‌లో వ‌చ్చిన నిఖిల్ వారిని అడ్డుకుంటాడు. ఆ త‌ర్వాత అత‌డి అస‌లు గెట‌ప్‌ను చూపించారు. జిమ్‌లో రౌడీల‌ను నిఖిల్ చిత‌క్కొట్టే సీన్ మంగ‌ళ‌వారం నాటి ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. హీరో లెవెల్‌లో నిఖిల్‌కు భారీగా ఎలివేష‌న్లు ఇచ్చారు.

నిఖిల్‌కు పోలీస్ బాస్ హెడ్...