భారతదేశం, ఫిబ్రవరి 2 -- తమిళ మూవీ మేయళగన్ చిత్రం తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో వచ్చింది. తమిళ హీరోలు కార్తీ, అరవింద స్వామి ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మంచి ప్రశంసలు దక్కించుకుంది. సరదాగా ఉంటూనే ఎమోషనల్‍గా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు ప్రేమ్ కుమార్.

తమిళంలో ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కాగా.. తెలుగు వెర్షన్ సత్యం సుందరం ఒక్క రోజు తర్వాత థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సత్యం సుందరం ఇప్పుడు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. టెలికాస్ట్ డేట్ ఖరారైంది.

సత్యం సుందరం సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం సాయంత్రం స్టార్ మా టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ సినిమా టీవీ ప్రీమియర్ వివరాలను స్టార్ మా అధికారికంగా ప్రకటించింది.

మేయళగన్ చిత్రం అక్టోబ...