భారతదేశం, ఫిబ్రవరి 22 -- Tv Premiere: ఎంత పెద్ద హిట్టు సినిమా అయినా థియేట‌ర్ల‌లో విడుద‌లైన నెల నుంచి నెల‌న్న‌ర లోపు ఓటీటీలోకి రావ‌డం ఇప్పుడు కామ‌న్‌గా మారింది. ఓటీటీలో రిలీజైన నాలుగైదు నెల‌ల గ్యాప్‌ త‌ర్వాత టీవీలోకి వ‌స్తుంటాయి. టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ రూల్‌ను తిర‌గ‌రాస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేయ‌బోతున్న‌ది. ఓటీటీ కంటే ముందుగానే ఈ మూవీ టీవీలోకి రాబోతోంది. జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది.

సంక్రాంతికి వ‌స్తున్నాం టీవీ ప్రీమియ‌ర్ డేట్‌ను జీ తెలుగు శ‌నివారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. మార్చి 1న టెలికాస్ట్ కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సాయంత్రం ఆరు గంట‌ల‌కు ప్ర‌సార‌మ‌వుతుంద‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఓ వీడియోను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో రిలీజైన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ ...