Hyderabad, మార్చి 16 -- TV Actress Accuses Co Star For Molestation In Holi Festival: హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో సంబురంగా జరుపుకుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా సంతోషంగా రంగులు పూసుకుంటూ హోలీ జరుపుకున్నారు. అయితే, ఈ హోలీ వేడుకల్లో అసభ్య ప్రవర్తన చోటుచేసుకుంది.

ముంబైలోని హోళీ పండుగ వేడుకల్లో సహనటుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక బుల్లితెర నటి ఆరోపించింది. ఈ విషయాన్ని ఎన్డీటీవీకి పోలీసు అధికారులు తెలిపారు. ముంబై జోగేశ్వరిలో సదరు నటి పనిచేస్తున్న సంస్థ నిర్వహించిన ఓ రూఫ్‌టాప్ పార్టీలో 29 ఏళ్ల సహనటుడు (ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో పనిచేస్తున్నాడు) బలవంతంగా తన ముఖంపై రంగులు వేసి, అనుచితంగా తాకినట్లు ఆమె పేర్కొంది.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో టెలివిజన్ నటి హోలీ పార్టీలో జరగిన సంఘటనను వివరించింది. తన సహనటుడు మద్యం సేవించి, ఆమెను వ...