Hyderabad, జనవరి 30 -- పసుపు ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచే సమ్మేళనం. దీనిలో ఔషధ గుణాలతో పాటూ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన సౌందర్య ప్రయోజనాలను పొందడానికి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో పసుపు ఆరోగ్యానికి ఒక వరంగా భావిస్తారు. అందుకే పెళ్లికి ముందు వధువు పసుపును అప్లై చేయడం వల్ల మేని ఛాయ మెరుగుపడుతుందని అంటారు. అలాగని పసుపును ముఖానికి ఎక్కువగా అప్లై చేస్తే స్కిన్ టోన్ మెరుగుపడటానికి బదులు సైడ్ ఎఫెక్టులు వస్తాయి.

అధికంగా పసుపును ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుగుపడటానికి బదులు ముఖం రంగు అందవిహీనంగా మారుతుంది. ముఖం పసుపు రంగులోకి మారడం వల్ల అందం పాడవుతుంది. అటువంటి పరిస్థితిలో, చర్మంపై రాసే ముందు పసుపును తక్కువగా రాయడం ఉత్తమం. అలాగని ప్రతిరోజూ పసుపు రాయాల్స...