భారతదేశం, ఫిబ్రవరి 18 -- Tuni High Tension : కాకినాడ జిల్లా తుని మున్సిపల్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తుని మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారంతా తిరిగి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంటికి వెళ్లారు. సోమవారం వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని భావించినా కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు ఎన్నిక వాయిదా పడింది. నేడు మరోసారి ఎన్నిక కోసం ఏర్పాట్లు చేయగా...ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కౌన్సిలర్లు వీధుల్లో పరుగులు పెడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మున్సిపల్‌ ఆఫీసు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి దాడిశెట...