Hyderabad, మార్చి 1 -- గర్భం తర్వాత చాలా మహిళలకు పొట్ట పెరగడం సహజం. మూడు, నాలుగు లేదా పది నెలల తర్వాత కూడా ఆ పొట్ట తగ్గకపోతేనే సమస్య. కాలం గడుస్తున్న కొద్దీ పెరిగిన ఆ పొట్ట 'హ్యాంగింగ్ బెల్లీ'గా మారుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి చాలా మంది మహిళలు వ్యాయామాలు చేస్తారు. నిజానికి ప్రసవం తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకునేందుకు చాలా మంది చేస్తున్న వ్యాయామాలు సరైనవి కావని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాయామాలు డెలివరీ తర్వాత వచ్చే బెల్లీ తగ్గించడంలో ఫలితం ఇవ్వవు. ప్రసవం తర్వాత పెరిగిన పొట్టను తగ్గించడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి. వాటికి బదులుగా మీరు ఈ 5 వ్యాయామాలు చేస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. ఇవి మీ పొట్ట కొవ్వును తగ్గించడానికి బదులు సమస్యను మరింత పెంచుతాయి.

ప్రసవం తర్వాత పెరిగిన పొట్టను తగ్గించడానికి క్రంచెస్ చేయడం వల్ల ఎలాంట...