Hyderabad, ఫిబ్రవరి 8 -- రసాయనాలు వాడకుండానే చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవాలనుకుంటున్నారా? మీ స్కిన్ కేర్ రొటీన్ లో తులసీని యాడ్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందొచ్చట. కేవలం ఆరాధన కోసం మాత్రమే వినియోగించే ఈ తులసిలో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయా అని షాక్ అవకండి. ఆయుర్వేద, నేచురోపతిలో కొన్ని శతాబ్దాలుగా తులసిని వాడుతున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ ఫ్లమ్మేటరీ గుణాలు ఉండి చర్మానికి మెరుగైన సౌందర్యాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియా కారణంగా చర్మంపై ఏర్పడే మచ్చలకు, తరచుగా దురదతో ఇబ్బందిపడుతున్న వారికి ఇది సహజమైన సొల్యూషన్.

ప్రతిరోజూ ముఖంపై మచ్చలతో ఇబ్బందిపడే వారికి ఇది సహాయకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు బ్యాక్టీరియాతో పోరాడి మచ్చలను పోగొడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు చర్మాన్ని ఎర్రబారకుండా ...