భారతదేశం, మార్చి 21 -- కోర్ట్ ఫేమ్ రోష‌న్‌, కార్తీకేయ దేవ్‌, శాన్వీ మేఘ‌న‌, స్టీఫెన్ మ‌ధు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హార‌ర్ కామెడీ మూవీ టుక్ టుక్ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. సుప్రీత్ సి కృష్ణ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ కామెడీ మూవీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించిందా? హార‌ర్ ఎలిమెంట్స్‌తో భ‌య‌పెట్టిందా? అంటే?

రాయ‌ల‌సీమ‌లోని ఓ ప‌ల్లెటూరికి చెందిన ముగ్గురు స్నేహితులువీడియోలు తీసి వాటిని అమ్ముకొని బాగా డ‌బ్బులు సంపాదించాల‌ని ప్లాన్ వేస్తారు. కెమెరా కొన‌డానికి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో వినాయ‌కుడిని నిల‌బెట్ట‌డానికి చందాలు వ‌సూలు చేస్తారు. ఊరి పెద్ద మ‌నిషితో పోటీప‌డి మ‌రి వినాయ‌కుడిని ప్ర‌తిష్టిస్తారు. దేవుడి ఊరేగింపుకు బండి అవ‌స‌రం కావ‌డంతో పాత బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్‌ను ఆటోలా అందంగా ముస్తాబు చేస్తారు.

ఆ బండి రాక‌తో ముగ్గురి స్నేహితుల జీవిత...