Hyderabad, ఏప్రిల్ 8 -- భారతదేశం అప్పట్లో ఇంకా బ్రిటిష్ వారి కోరల్లోనే ఉన్న కాలం. ఇక భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అదే సమయంలో వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడైన గోపాలకృష్ణ గోఖలే ఎక్కడకో అర్జెంటుగా వెళ్లవలసి వచ్చింది. ఆయన రైలులో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చొన్నాడు. ఆయన కూర్చున్న తర్వాత ఒక ఆంగ్ల అధికారి అక్కడికి వచ్చి అదే కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు.

గోపాలకృష్ణ గోఖలేను చూసిన వెంటనే ఆంగ్లేయుడికి కోపం వచ్చేసింది. భారతదేశ ప్రజలు బ్రిటిష్ వారు ఎక్కే కంపార్ట్మెంట్లోకి ఎలా ఎక్కుతారని అరిచాడు. అంతేకాదు గోపాలకృష్ణ గోఖలేని అవమానించాడు. అతడు సామానులు తీసి కంపార్ట్మెంట్ నుంచి బయటకు విసిరేసాడు. చుట్టుపక్కలా ఉన్నవారు అలా చూస్తూ ఉండిపోయారు.

ఈ సంఘటన జరుగుతున్న సమయంలో గోపాలకృష్ణ గోఖలేతో పాటు అతని సహచరుడు ఒకరు ఉన్నారు. అతడు ఆంగ్లేయుడు...