Hyderabad, మార్చి 25 -- ఓటమి భయమే సగం వైఫల్యాలకు కారణం. ఓటమి భయాన్ని ముందుగా గెలవండి. అదే మిమ్మల్ని వైఫల్యానికి దగ్గర, విజయానికి దూరం చేస్తుంది. క్యూబన్ విప్లవంలో ప్రముఖ విప్లవకారుడు చేగువేరా కూడా ఇదే విషయాన్ని చెబుతాడు. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మనం జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టగలమని ఆయన అంటాడు. చేగువేరా జీవితంలో భయం అనే పదానికే చోటు లేదు. అందుకే ఆయన ప్రపంచం మెచ్చిన కమ్యూనిస్టులు విప్లవకారుడిగా పేరు తెచ్చుకున్నాడు.

మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే సరిపోదు. దాన్ని సాధించేందుకు భయాన్ని కూడా విడనీడాలి. భయపడే వ్యక్తి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లేందుకే భయపడతాడు. అందుకే భయాన్ని ఎలా అధిగమించాలో ముందుగా నేర్చుకోండి. ఆ తర్వాత మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించవచ్చు.

ఓడిపోతామనే భయం మిమ్మల్ని రెండు అడుగులు వె...